Take a fresh look at your lifestyle.

జులై 26 నుండి ఇండియన్ గ్యాస్ మానిడేటరీ ఇన్స్పెక్షన్

  • ఎల్పిజి కస్టమర్లు మెకానిక్ లకు సహకరించాలి.
  • ప్రమాదాల నివారణ కోసమే సర్వే కేవైసీ,ఓటీపీ సర్వే వారికి చెప్పి సహకరించాలి.
  • శ్రీ మై ఇండేన్ గ్యాస్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, నాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఐఓసీఎల్ ఎల్ పి జి ఇండేన్ గ్యాస్ కస్టమర్లను గ్యాస్ వాడుతున్న వినియోగంపై సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్టిపిసి శ్రీ మయి గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.జూలై 26 నుండి రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇండేన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగ దారులు సిలిండర్ వాడుతున్న విధానాన్ని ఐఓసీఎల్ మెకానికల్ టెక్నీషియన్స్ ఇంటింటా సర్వే జరుపుతున్నారని,ఈ సర్వేకు ఎల్పిజి గ్యాస్ కస్టమర్లు సర్వే బృందానికి సహకరించాలని ఆయన కోరారు.ఈ మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారికి,రామగుండంమున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లకు వారు వినతిపత్రం అందజేశారు. ఇండేన్ సంస్థ నుండి శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన మెకానిక్ టెక్నీషియన్ ఇంటింటా గ్యాస్ కస్టమర్ల పరిశీలన కోసం వస్తారని వారికి ఆధార్ ఈ కేవైసీ,ఓటీపీ నెంబర్ చెప్పాలని ఇంటి సర్వేకు వచ్చిన బృందం 236రూపాయలు జీఎస్టీ తో కలిపి రసీదు ఇస్తారని దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఇంట్లో గ్యాస్ స్టవ్ వెంటిలేషన్ లో ఉందా గ్యాస్ పైప్ సరిగా ఉందా లీకేజీలు ఉన్నాయా సిలిండర్ టాప్ లో నీటారుగా పెట్టారా లేదా అనే విషయాలను పరిశీలిస్తారని తెలిపారు.గ్యాస్ అయిపోయే సమయంలో వేడి నీటిలో కింద పెట్టకూడదని,వంట చేసే సమయంలో సిలిండర్ పై బరువు వస్తువులు పెట్టద్దని కిచెన్ లో పూజ గదిలో దీపాలు వెలిగించి ఉంచడం ప్రమాదానికి దారి తీస్తుందని,రిఫ్రిజిరేటర్ కూడా గ్యాస్ వంట గదిలో ఉండకూడదని,కిరోసిన్,పెట్రోల్, మండే వస్తువులు కిచెన్లో ఉంచరాదని సర్వే బృందం కస్టమర్లకు వివరిస్తూ అవగాహన కల్పిస్తారని ఆయన అన్నారు. గ్యాస్ పైప్ ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలని చిన్నచిన్న రంధ్రాలు పడి పైపు కట్ అయి ఉంటే లీకేజీలు అవుతాయని దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కస్టమర్ల భద్రత,రక్షణ కోసమే ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. ఐ ఎస్ ఐ గ్యాస్ స్టవ్, పైపు డ్యామేజ్ చెకింగ్ స్టవ్ కాల పరిమితి దాటితే మార్చడం లీకేజీ సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 19 0 6 కాల్ చేయాలని తెలిపారు. మాండేటర్ సర్వే కోసం వచ్చే బృందానికి గ్యాస్ కస్టమర్లు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.