- జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన పౌష్టిక ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత కోసం డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలను 40 శాతం మేర పెంచడం జరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం, జాతీయ అందత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా భవాని నగర్ ఉమెన్స్ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించగా,కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మంజూరైన 31 కళ్లద్దాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల పౌష్టిక ఆహారం ఆరోగ్యానికి సంబంధించి ప్రతినెల బిల్లులు చెల్లించే విధంగా గ్రీన్ చానెల్ ను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ప్రభుత్వ గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందజేయడం ద్వారా ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధను అర్థం చేసుకోవచ్చని విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డియంహెచ్ ఓ ప్రమోద్, ప్రిన్సిపాల్ సునీత, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, ఆడువాల లక్ష్మణ్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, దుమల రాజ్ కుమార్, తిరుమలయ్య, గోపి, కృష్ణ రావు, కుసరి అనిల్, ఎల్ జి రమేష్, ఓడ్నాల శ్రీనివాస్, కొలగని సత్యం, రామ్మోహన్ రావు, బొడ్ల జగదీష్, బిపెల్లి శ్రీనివాస్, పోతూనుక మహేష్, గిరి, ప్రవీణ్ రావు, ముఖిధ్ రవి శంకర్, క్రాంతి, వంశి బాబు, సంకెమహేష్, రవి, వైద్య సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.