Take a fresh look at your lifestyle.

కవాతులో పోలీస్ బ్యాండ్ ప్రాముఖ్యత చాలా అవసరం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత భానులను వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఎస్పి చేతుల మీదుగా పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను అందజేశారు.ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ కేవలం సంగీత బృందంగా కాకుండా,రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో జరిగే అధికారిక వేడుకలు అయన స్వాతంత్ర్య దినోత్సవం,గణతంత్ర దినోత్సవం, అమరవీరుల దినోత్సవం, పోలీసు పరేడ్‌లు, గౌరవ వందన కార్యక్రమాల్లో పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అన్నారు.ఈ మధ్యకాలంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ బ్యాండ్ పనితీరు ప్రశంసనీయంగా ఉందని ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు, బ్యాండ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.