సైబరాబాద్ లో వీకెండ్–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్..240 మందిపై కేసులు -సైబారాబాద్ ట్రాఫిక్ డిసిపి రంజివ్ రతన్ కుమార్
ముద్ర, శేరిలింగంపల్లి :
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతునవారిపై పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి- I రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 240 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.193 ద్విచక్ర వాహనదారులు, 09 ఆటోలు,38 కార్లు, హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —199 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య,32 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య,09 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు.
వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.
గత వారంలో మొత్తం 86 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి.వీరిలో 02 మందికి జరిమానా, జైలు శిక్ష,01 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 83 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.