Take a fresh look at your lifestyle.

జూరాల జలాశయంలో దూకి యువకుడు ఆత్మహత్య

* ధరూర్ ఎస్ఐ నందీకర్ ఆధ్వర్యంలో జలాశయంలో గాలింపులు
* చీకటి పడటంతో నిలిపివేసిన గాలింపు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:
జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన శనివారం సాయంత్రం ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.‌ ధరూర్ ఎస్సై నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల కు చెందిన‌ చాణక్య(28) హెటిరో ఫార్మాలో పని చేస్తున్నాడు.‌

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చాణక్య‌ శనివారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై‌ జడ్చర్ల నుంచి జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు పై ఎవరు లేని సమయంలో 51వ గేటు వద్ద బ్యాక్ వాటర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. 51వ గేటు వద్ద మృతుడి ద్విచక్ర వాహనాన్ని గుర్తించినట్లు చెప్పారు.

ఆదివారం ధరూర్ ఎస్ఐ నందీకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక జాలర్ల సాయంతో జూరాల ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకు మృతదేహం ఆచూకి లభ్యం కాలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు అనారోగ్య సమస్యలే మృతుడి సోదరుడు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. సోమవారం ఉదయం యదావిధిగా గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

Leave A Reply

Your email address will not be published.