Take a fresh look at your lifestyle.

భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి రాంజీ గోండు

  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని నిర్మల్ ప్రాంతాన నడిపిన గోండు వీరుడు రాంజీగోండు అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. రాంజీ గోండు165 వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తో పాటు, చైన్ గేట్ లో గల రాంజీగోండు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంజీ గోండు పోరాట పటిమను గుర్తుచేసుకుంటూ వారి నాయకత్వంలో ఏకకాలంలో అటు ఆంగ్లేయులు, ఇటు స్థానిక నైజాం పాలకులతో పోరాటం సాగించిన గొప్ప వీరుడు రాంజీ గోండు అని అన్నారు. నిర్మల్ గడ్డపై పోరాడి ప్రాణత్యాగం చేసిన రాంజీ గోండు సహా వెయ్యిమంది వీరులను ప్రతీ ఒక్కరం స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిని ముందు తరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.