Take a fresh look at your lifestyle.

పురపాలికల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం పురపాలకలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యక్ష కార్యచరణ చేపట్టిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురపాలికలో చేపట్టిన వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతర్గత దారులు డ్రైనేజీ వ్యవస్థ ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు వందరోజుల కార్యక్రమం ప్రారంభించుకోవడం శుభ పరిణామం అని అన్నారు. పరిసరాలు పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని పట్టణ ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం పుర కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పరిస్థితి సిబ్బందికి దుస్తులు ఇతర సామాగ్రిని అందజేశారు.కార్యక్రమంలో పుర కమిషనర్ మహమూద్ షేక్, మాజీ ప్రజా ప్రతినిధులు, పుర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.