ముద్ర, శేరిలింగంపల్లి:
బూత్ కమిటీలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మద్దతు కోరుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో బూత్ కమిటీలు పూర్తి, పార్టీ బలోపేతం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్, రవీందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేష్ మరియు ఇతర నాయకులతో కలిసి పాల్గొన్న రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండున్నరేళ్లు సమయం ఇచ్చాం, ఏమైనా చేస్తారేమోనని కానీ ఇప్పటికీ ఇంకా అవే మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అందు కోసం మన నియోజకవర్గంలోని ప్రతి బూత్ లో బూత్ కమిటీలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీల సభ్యులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మనం ప్రజలకు చేరువగా ఉంటే ప్రజల మద్దతు మనకు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను వివరించి వీలైనంత ఎక్కువ మందిని పార్టీ లోకి ఆహ్వానించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ బలపేతానికి కృషి చేయాలన్నారు. అలాగే అంబేద్కర్ జయంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి బూత్ లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి. అశోక్ కురుమ, రవీందర్ రావు, బుచ్చిరెడ్డి, వసంత్ యాదవ్, కేశవరావు, రామరాజు, రాధాకృష్ణ యాదవ్ , అనిల్ గౌడ్, మాణిక్ రావు, కృష్ణo రాజు,రాజేష్ గౌడ్, పద్మ, సింధు రెడ్డి, బిందు, విజయలక్ష్మి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.