ముద్ర, మల్యాల: మండలంలోని మల్యాల, ముత్యంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జగిత్యాల డిపిఓ మదన్ మోహన్ మంగళవారం సందర్శించారు.లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు పథకం (ఎస్ఆర్ఎస్) అమల్లో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు.గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది.ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది.సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎస్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ వర్తిస్తుందని అన్నారు.ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలోఎంపీఓ ప్రవీణ్, మల్యాల, ముత్యంపేట పంచాయతీ సెక్రెటరీలు ఉన్నారు.