ముద్ర ప్రతినిధి, వనపర్తి : మానవ హక్కుల పరిరక్షణ అంటే ప్రజలకు రాజ్యంగం చట్టం ద్వారా కల్పించిన హక్కులను కాపాడటం అనీ,మానవ హక్కులు అనేవి జాతి, లింగం, మతం, భాష జాతీయత వంటి వాటితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికి జన్మత సంక్రమించే హక్కులుగా భావించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని తరుణి ఫంక్షన్ హాల్లో మానవ హక్కుల పరిరక్షణ మరియు బాధ్యతలకు గురించి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఎస్పీ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకోసం భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ ఉందని ఆయన తెలియజేసారు.మానవ హక్కుల పరిరక్షణకు చట్టాలు రూపొందించడం జరిగిందని, మానవు హక్కుల పరిరక్షణ బిల్లు 2019లో ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలుపారు. భానిసత్వం హింస నుండి స్వేచ్ఛ, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పని, విద్యహక్కులు,సమానత్వం న్యాయంకోసం పోరాటం చేయడమే మానవ హక్కుల పరిరక్షణగా భావించాలని ఆయన తెలియజేసారు.నేడు విద్యాలయాలు అంటే చదవడం రాయడం నేర్పే స్థలంగా అనుకుంటున్నాం.సమగ్ర అనుభవానికి సంబంధించిన విషయాలను నైపుణ్యాలను నేర్పేదే విద్యాలయాలుగా భావించాలని విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు సమాజ పరిణామాలను గ్రహించాలని మానవ హక్కులను బాధ్యతలను తెలుసుకొవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఇంచార్జ్ కొమ్ము అగిరప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెoబర్ పోచయ్య, రాష్ట్ర కార్యదర్శి జిటి శ్యామ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు సి. విశ్వo బాబు, ఉపాధ్యక్షుడు జి.ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోర్ల శైలన్ కుమార్, ప్రెస్ సెక్రటరీ జి.శివకుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కొట్రా బాలు, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, ఆర్డీఎస్ ఎన్జీవో నిర్వాహకులు చిన్నమ్మ తామస్, సఖి కేంద్ర నిర్వాహకులు కవిత, జిల్లా జెండర్ స్పెషలిస్టులు శ్రీ వాణి, సలోమి , చిత్రకారుడు జి.టి.కృష్ణ మరియు విద్యార్థులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.