ముద్ర, నారాయణపేట:
పట్టణంలోని యాదగిరి రోడ్… బైరం కొండ గ్రామాల మధ్య బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నారాయణపేట పోలీసులు పట్టుకున్నారు. దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసుల సమాచారం మేరకు గుర్తించి పట్టుకున్నారు. 50 బస్తాలు ఉండగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. వాహన యజమాని వెంకటేష్ పై నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై అందే వెంకటేశ్వర్లు తెలిపారు.