Take a fresh look at your lifestyle.

మూడు నెలల రేషన్ పంపిణీని : అదనపు కలెక్టరు వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల రేషన్ పంపిణీని ఏప్రిల్ 2026లో అందజేస్తున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు రేషన్ షాపుల నుండి మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ 2026 మాసంలోనే పొందాలని అందుకు అనుగుణంగా సంచులు, రవాణా సౌకర్యం చూసుకోవలసినదిగా సూచించారు. జిల్లాలో ఉన్నటువంటి 2,50,789 రేషన్ కార్డులలోని 7,91,142 మంది యూనిట్లకుగాను 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు తెలిపారు. అనంతరం వలిగొండ మండలంలోని గన్ని గోదాం, బఫర్ గోదాం, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్ లను తనిఖీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.