Take a fresh look at your lifestyle.

వరదల మాక్ డ్రిల్ కోసం వీడియో కాన్ఫరెన్స్‌

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రానున్న వర్షాకాలం నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో వరదల సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పాల్గొన్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.