ముద్ర,కుషాయిగూడ:
చర్లపల్లి డివిజన్ కు మంజూరు అయిన వాటర్ వర్క్స్ కు సంబందించిన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని హెచ్ఎం డబ్ల్యూ ఎస్ కమిషనర్ అశోక్ రెడ్డి కి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి వినతి పత్రం అందజేశారు.
నాగార్జున నగర్ మెయిన్ రోడ్ లో 25 లక్షలు,చక్రిపురం లలితా వైన్స్ దగ్గర 30 లక్షలు,
విద్యా మారుతి నగర్ లో 21.3 లక్షలు, చర్లపల్లి 13 లక్షలు,
బి.యన్ రెడ్డి నగర్ 3. 60 లక్షలు, భరత్ నగర్ 4.90 లక్షలు, లక్ష్మీ నగర్ 31 లక్షల పనులు గత వారం కిందట శాంక్షన్ అయ్యాయని కమిషనర్ తెలిపారు. కావున వెంటనే అధికారులకు తెలియజేసి పనులు ప్రారంభించాలని కమిషనర్ అశోక్ రెడ్డి ని ఈ సందర్బంగా బొంతు శ్రీదేవి కోరారు.