- మర్యాదపూర్వంగా డిప్యూటీ సీఎం భట్టితో భేటీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు.ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారికి ఉత్తర్వులను జారీ చేశారు.ఈ క్రమంలో మంగళవారం నాడు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియాకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సందీప్ కుమార్ సుల్తానియా 1998 సివిల్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్థిక, రవాణా, సహకార సంస్థలు, పర్యాటక రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, భూ రెవెన్యూ నిర్వహణ, పట్టణాభివృద్ధిలో అపార అనుభవం ఆయనకు ఉంది.ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న ఆయన తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమతులయ్యారు.