Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆరు పరీక్షా కేంద్రాలు, కోరుట్ల పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జగిత్యాల పట్టణంలో 2190 విద్యార్థులకు గాను 2085 మంది విద్యార్థులు పరీక్షకు 95.2 శాతం హాజరయ్యారు. కోరుట్ల పట్టణం కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలలో 1330 విద్యార్థులకు గాను 1253 విద్యార్థులు పరీక్షకు 94.21 శాతం హాజరయ్యారని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరిగల అశోక్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మొత్తం 3520 మంది విద్యార్థులకు గాను 3338 మంది విద్యార్థులు 94.8 శాతం హాజరయ్యారని అయన పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సహా కోఆర్డినేటర్ గా సమన్వయకర్తగా డాక్టర్ జివిఆర్ సాయి మధుకర్, అసిస్టెంట్ సమన్వయకర్తగా డాక్టర్ పడాల తిరుపతి, రూట్ అధికారులుగా డాక్టర్ జి చంద్రయ్య, డాక్టర్ కోలగాని మహేష్, ఎస్ కె ఎన్ ఆర్ పరీక్ష కేంద్రంలో పరిశీలకులుగా డాక్టర్ ఆర్ దశరథం, టెక్నికల్ సాంకేతిక విభాగంలో ఎం గణేష్ విధులు నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహణలో పాల్గొన్న అధికారులు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, పాలీసెట్ రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ సిహెచ్ యాదయ్య, అడిషనల్ కలెక్టర్స్, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, ఆరోగ్య, విద్యుత్ శాఖ, విద్యాశాఖ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ప్రొఫెసర్ అరిగేలా అశోక్ ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.