Take a fresh look at your lifestyle.

సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి హెచ్చరిక మెదక్ కలెక్టర్‌కు వినతిపత్రం

ముద్ర ప్రతినిధి, మెదక్:
సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు, కౌన్సిలర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు అత్యవసరంగా 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఘనపూర్ ఆయకట్టు కింద పంటలు ప్రస్తుతం కీలకమైన పొట్ట దశలో ఉండగా నీటి కొరత కారణంగా ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రాప్ హాలిడే ప్రకటించక ముందే రైతులు పంటలు వేసుకున్నారని, ఆలస్యంగా ప్రకటించడం వల్ల వారు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంట చేతికి వచ్చే ఈ సమయంలో ఒక తడి నీరు అందిస్తే పంటలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అందువల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు వెంటనే 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సింగూర్ నుంచి ఘనపూర్‌కు నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యకురాలు యం.లావణ్య రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ లు గడ్డమీద కృష్ణ గౌడ్, లింగారెడ్డి మెదక్, హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం.ఆంజాగౌడ్, సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు బట్టి ఉదయ్, జుబెర్ అహ్మద్,గౌస్, మాజీ కౌన్సిలర్ లు మాయ మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు, మెదక్, పాపన్నపేట్, హవెలిఘనపూర్ మండల నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.