Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు

  • జిల్లా విద్యాధికారి కె రాము.
  • ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉంటాయని జిల్లా విద్యాధికారి కె రాము పేర్కొన్నారు. ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామం లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాధికారి కె రాము ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయుడు నూనావత్ రాజేష్ తన ముగ్గురు పిల్లలు అనిరుధ్, అన్విత,అక్షర లను కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి జరుగుతుందని, అర్హత కలిగిన, అనుభవజ్ఙులైన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు రెండు జతల యూనిఫామ్స్‌, నోట్‌ బుక్స్‌ ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎంఇఓ సీతాలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు మ్యాన పవన్ కుమార్, ఆసిఫ్, రాజేష్,ప్రీతి, సంపూర్ణ, వేంకటవ్వ గ్రామ పెద్దలు వెల్ముల సతీష్,కుమ్మరి తిరుపతి, కుమ్మరి. రవి, ఒడ్డేటి భూమయ్య, ఒడ్డేటి నరేష్, సత్తంశెట్టి అనిల్, కుమ్మరి రాజన్న,ఆకుల ప్రసాద్, సి ఆర్ పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.