Take a fresh look at your lifestyle.

అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది

  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ లో రూ. 6లక్షల నిధులతో నిర్మించిన గౌడ యువజన సంక్షేమ సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడన్న లకు రక్షణగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ చేపట్టారని, గౌడన్న గాయపడితే వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కిట్ల ను పంపిణీ చేస్తుందని అన్నారు. రక్షణగా ప్రతి గీత కార్మికుడు కిట్లను తప్పనిసరిగా వాడుకోవాలన్నారు. హస్నాబాద్ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి 45 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేయటం జరిగిందని, కొందరికి డబ్బులు కూడా అకౌంట్ లో జమ అయ్యాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది అని అన్నారు. ముఖ్యమంత్రితో కలసి పనిచేసి మరిన్ని నిధులు తెచ్చి కుల సంఘాల అభివృద్ధికి,జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, డిఇ మిలింద్, ఎఇ విజయ్, కార్యదర్శి ప్రమోద్, మాజీ ఎంపిటిసి దమ్మ మల్లారెడ్డి, గౌడ్ సంఘం అధ్యక్షులు వెంకటరాజం, నాయకులు సుగుణాకర్ రావు, భీమారావు, దూడ వెంకటేష్, వావిలాల నవీన్, ధర్మరాజు, సుదర్శన్, పూర్ణచందర్ రావు, రాజశేఖర్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.