ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ మునిసిపాలిటీపై గులాబీ జం డా ఎగిరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బోథ్ ఎం ఎల్ ఎ అనిల్ జాదవ్ అన్నారు. పట్టణంలోని 18, 19 వార్డుల్లో గడప గడపకు బి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన బోథ్ ఎం ఎల్ ఎ అనిల్ జాదవ్ మాట్లాడుతూ నిర్మల్ ను జిల్లాగా చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుపెట్టుకొని కారు గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి రాంకిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు