Take a fresh look at your lifestyle.

ధర్మపురి ఎన్నికల ప్రచార సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..

గుడి పూజాలను.. పల్లకి మోసిన బోయలను పట్టించుకోలేదు..

ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాటల నమ్మద్దు..

మాటల మారాఠీలు బీఆర్ఎస్ నాయకులు..

 

ధర్మపురి:

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏనాడు పేద ప్రజల సంక్షేమ పట్టించుకోలేదని, అర్హులైన పేదలకు ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి మున్సిపాలిటి పరిధిలోని 4వ వార్డు, 12 వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ధర్మపురి ఆలయంలో పని చేస్తున్న పూజాలను పట్టించుకోలేదని, దేవుని పల్లకి మోసిన బోయలను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆలయంలో పూజారుల సమస్యతో పాటు బోయలు, స్వీపర్ల సమస్యను పరిష్కారించానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 10ఏళ్ల పాటు అధికారంలో ఉండి పేదల సంక్షేమం ఒక్క రోజు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన నేతల విలాస వంతంమైన జీవితాలు గడిపారు తప్ప పేద ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు , రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి అన్నారు. రాష్ర్టంలో ప్రజా పాలన ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.

గతంలో శ్రీలక్ష్మి నర్సింహాస్వామి ఆలయం దేవాలయంలో నిర్వహిస్తే కొంత మందికి మాత్రమే కల్యాణం వీక్షించే అవకాశం ఉండేదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గోదావరి నది ఒడ్డున శ్రీలక్ష్మి నర్సింహాస్వామి కల్యాణం నిర్వహించి లక్షల మంది ప్రజలు వీక్షించే విధంగా చేశామని మంత్రి గుర్తు చేశారు.

ధర్మపురి లక్ష్మినర్సింహాస్వామి ఆలయం కీర్తి శేషులు జువ్వాడి రత్నాకర్ రావు గారు చేసిన అభివృద్ది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మపురి పట్టణం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే వచ్చే మున్సిపాలిటి ఎన్నికల్లో 15 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మద్దు..

ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. మాటల మారాఠీలు బీఆర్ఎస్ నాయకులు అని తప్పును పది సార్లు ఒప్పు అనే విధంగా ప్రజలను వాళ్ల నమ్మిస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ మాటలు నమ్మితే మోసపోతామని, ఎవ్వరి ఏకష్టం వచ్చిన నేరుగా తనను సంప్రదించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

4వ వార్డు, 12వ వార్డులపై వరాల జల్లు..

ధర్మపురి మున్సిపాలిటి పరిధిలోని 4వ వార్డు, 12వ వార్డులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వరాల జల్లు కురిపించారు. బోయ కులస్తులకు కమ్యూనిటి హాల్నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. గంగా పుత్రులకు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి హమీ ఇచ్చారు. రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిస్తే 60 రోజుల్లో అధికారులను వెంట బెట్టుకొని వచ్చి డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి పేర్కొన్నారు. రెండు వార్డుల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.