కోరుట్ల, ముద్ర: జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ 20 – 25 పోటీలు ఆదివారం రోజు జగిత్యాల లోని శుభమస్తు కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కెపిఎస్ విద్యార్థులు సబ్ జూనియర్ కేటగిరీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ తో పాటు తైక్వాండో ఛాంపియన్షిప్,సర్టిఫికెట్ ను,జిల్లా జనరల్ సెక్రెటరీ సంతోష్ మాస్టర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని కోరుట్ల పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గుజ్జేటి వెంకటేష్ తెలియజేశారు.సర్టిఫికెట్, మెడల్ సాధించిన విద్యార్థులను తైక్వాండో మాస్టర్ సంద్రగిరి సంధ్య, స్కూల్ ప్రిన్సిపాల్, అభినందించారు.