Take a fresh look at your lifestyle.

కొండగట్టులో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

మల్యాల, ముద్ర : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ప్రత్యేక వేదికను ఏర్పరిచి శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపు గా పందిరిలోకి తీసుకువచ్చి కల్యాణం జరిపించారు.అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు, హనుమాన్ మాలా దారులు ఈ వేడుకలో పాల్గొని కళ్యాణం తిలకించి తరించారు.అంజన్న క్షేత్రం రామనామ స్మరణతో మారు మోగింది.మార్కండేయ గుడిలో పద్మశాలి ఆధ్వర్యంలో శ్రీరామనవ వేడుకలు ఘనంగా జరిగాయి.రాజారం గ్రామంలో ఎర్నాకుల రామస్వామి ఆలయంలో శ్రీరామనము ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో హనుమన్ టెంపుల్ వద్ద శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలే ఈవో శ్రీకాంత్ రావు, సూపరిండెంట్లు సునీల్, హరినాథ్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, ఆలయ అర్చకులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.