-మూడున్నర గంటలుగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించి ధర్నా -పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ రైతుల ఆందోళన
ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ గ్రామాల రైతులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు, ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నాకు దిగి రోడ్డును దిగ్బంధనం చేశారు. బుధవారం రైతులకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బిసి, ఎస్టి, ఎస్సి, జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజులు రైతులకు మద్దతుగా నిలిచి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదని, రైతులకు ఉన్న కాస్త భూమిని ప్రభుత్వం లాక్కోవడం సరైనది కాదని మాజీ ఎమ్మెల్సీ కవిత ధర్మ సమాజ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహరాజులు పేర్కొన్నారు. రైతులు తమ జీవనాధారంగా ఉన్న పట్టా భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాలో లక్ష ఎకరాల భూమిని రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన ఆటలు సాగనివ్వమని విషారాదన్ మహారాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి రైతులు నిర్వహించే ధర్నా వద్దకు వచ్చి రైతులకు న్యాయం చేస్తామని భూములను ఎట్టి పరిస్థితుల లోక్కోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని రైతుల కు మద్దతుగా నిలుస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల నుండి పట్టా భూములను లాక్కోవడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆమె పేర్కొన్నారు. ఒక సందర్భంలో రైతులను అరెస్టు చేసేందుకు వికారాబాద్ జిల్లా పోలీసులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు పోలీసు వాహనాలకు. అడ్డంగా రైతులు పడుకున్నారు. అంతేకాకుండా రోడ్డుపై బైఠాయించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండల తీవ్రతకు పలువురు రైతులు కిందపడి ఆపస్మరక స్థితిలోకి వెళ్లారు. సుమారు మూడున్నర గంటలుగా కొనసాగిన ధర్నా సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పోలీసులు రైతులను చుట్టూ మట్టి బలవంతంగా మాజీ ఎమ్మెల్సీ కవిత, ధర్మ సమాజ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహరాజులను అరెస్టు చేశారు. రైతులను పోలీసు వాహనాలు ఎక్కించేందుకు గట్టి ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.