ముద్ర ప్రతినిధి , కోదాడ …..రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల (జకాత్) ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
రంజాన్ పండుగ శాంతి, సౌహార్ద్రం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, మత సామరస్యంతో ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం మరింత బలపడాలని, అందరికీ ఆరోగ్యం, సంతోషం కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.