Take a fresh look at your lifestyle.

ఈనెల 14 నుంచి 17 వరకు రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

 

. ఏర్పాట్లను పరిశీలించిన తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి

ముద్ర, తాండూర్: తాండూర్ నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో కాగ్న నది సమీపంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఈనెల 14 నుండి 17 వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర ఉత్సవంలో భాగంగా చేపట్టిన ఏర్పాట్లను తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బసప్పతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ముఖ్యంగా ట్రాఫికు సమస్యతో అంతరాయం కలుగకుండా చూసుకోవాలని స్థానిక సర్పంచ్ నేతలతో పోలీసులు చర్చించారు. కార్యక్రమంలో బషీరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.