ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : కల్వకుర్తి పురపాలిక లోని రెండో వార్డులో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో మంజూరైన సిసి రోడ్డు పనులను శుక్రవారం కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే గారి సహకారంతో కల్వకుర్తి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాలల శ్రీనివాస్ రెడ్డి,, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడుముల చంద్రకాంత్ రెడ్డి, కల్వకుర్తి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీకాంత్, నాయకులు పాండురంగారెడ్డి, ఆంజనేయులు శ్రీకాంత్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.