ముద్ర ప్రతినిధి, భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామంలోని సురేంద్రపురి పంచముఖ హనుమద్దీశ్వర దేవస్థానంలో
ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా పంచముఖ ఉమామహేశ్వర కళ్యాణం, మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కుందా ప్రతిభ, ధర్మాధికారి అరవింద్ సుబ్రహ్మణ్య శర్మ మంగళవారం తెలిపారు.
15న ఉదయం పంచముఖ పరమశివునికి పంచామృత నిజాభిషేకం బిల్వార్చన, భక్తులచే పంచామృత నిజాభిషేకాలు, రుద్రహవనం,
అనంతరం పంచముఖ ఉమామహేశ్వర కళ్యాణం, కళ్యాణ సేవ జరుగుతాయన్నారు.
రాత్రి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల అభిషేకం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.