Take a fresh look at your lifestyle.

గ్రామాల అభివృద్దే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం -RO ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

 

ముద్ర, నారాయణపేట:

గ్రామాల అభివృద్దే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని పాలమూరు జిల్లా ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా భూనేడు గ్రామంలో అరబిందో హెల్త్ కేర్ సంస్థ సహకారంతో గ్రామంలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంటును ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురి కావద్దని గొప్ప ఉద్దేశ్యంతో భూనీడ్ లో త్రాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ తెలిపారు. అలాగే కేంద్ర నిధులతో అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించిందన్నారు.వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే.. యువత, మహిళలకు, రైతాంగం ఇలా అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. 2047 నాటికి వికాసిత్ భారత్ లక్ష్యం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది. బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.