Take a fresh look at your lifestyle.

బోడుప్పల్‌లో ఓపెన్ జిమ్ ప్రారంభం

బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మహితా ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ లను (04) చోట్ల లక్ష్మినగర్ పార్క్, ద్వారకా నగర్ పార్క్, శివ దుర్గా పార్క్, చిన్న క్రాంతి కాలనీ పార్కులలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరై ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు భూక్యా సుమన్, శేఖర్ రెడ్డి, బొమ్మకు కళ్యాణ్, ఇతర ప్రజా ప్రతినిధులు, మునిసిపల్ స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో మరిన్ని పార్కులు, జిమ్‌లు, ఆరోగ్య వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మేయర్ మాట్లాడుతూ యువత, మహిళలు, వృద్ధులు అందరూ వినియోగించుకునే విధంగా ఈ ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.