Take a fresh look at your lifestyle.

కేపీహెచ్‌బీలో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు

 

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 15:

కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్స్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను కూకట్‌పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​గిరిజనుల ఐక్యత, అభివృద్ధి కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి చిరస్మరణీయమని బండి రమేష్ కొనియాడారు.  ​అమృతనగర్ తాండాలో తానే స్వయంగా పర్యటించి, అక్కడి సమస్యలను గుర్తించి 62 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు.త్వరలోనే ఒక కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన శేరి సతీష్ రెడ్డిని బండి రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ​ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సేవాలాల్ మహారాజ్ భక్తులు మరియు గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.