Take a fresh look at your lifestyle.

జీవ ఇంధన పరిశోధనలో సంఘమిత్రకు డాక్టరేట్ ప్రధానం

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

విద్యారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( బిట్స్ ) యూనివర్సిటీలో జీవ ఇంధనంపై పరిశోధన చేసిన సామ@ నర్ర సంఘమిత్ర కు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. సంఘమిత్ర గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ చేసిన తర్వాత హైదరాబాద్ (BITS )బిట్స్లో పరిశోధక విద్యార్థిగా పీ.హెచ్.డి.లో చేరారు. ‘డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మైక్రో అల్గే బయో డీజిల్ బ్లెండ్స్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ ఫర్ సీఐ ఇంజన్ ‘ అనే అంశంపై ఈమె పరిశోధనలు . రోజు రోజుకు ఖరీదవుతూ,
పర్యావరణ కాలుష్య కారక మవుతున్న డీజిల్ కు ప్రత్యామ్నాయ పర్యావరణహితమైన జీవ ఇంధనం పై పరిశోధనలు చేశారు. సిద్దిపేట ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన సంఘమిత్ర హైదరాబాద్ లోని బిట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సందీప్ ఎస్ దేశ్ముఖ్ మార్గదర్శనం లో పరిశోధన చేసి థీసీస్ సమర్పించారు.కాగా ఈరోజు వైవా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్టరేట్ పట్టాను ప్రధానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.