Take a fresh look at your lifestyle.

సుస్థిర సాంకేతిక విప్లవం వైపు సివిల్ ఇంజనీర్లు అడుగులు వేయాలి

 

 

ముద్ర, బండ్లగూడ: సమాజానికి ఉపయోగపడేలా నేటి సాంకేతిక విప్లవం లో సుస్థిర సాంకేతిక ఆలోచనల దిశగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ అన్నారు. సి బి ఐ టీ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం మరియు ఐ ఐ పి సి సంయుక్తంగా 2026 జనవరి 28న ఒక నిపుణుల ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ ఉపన్యాసాన్ని సి బి ఐ టీ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి. శ్రీనివాస శర్మ గారు “పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న వృత్తిపరుల కోసం సివిల్ ఇంజినీరింగ్‌లో తాజా ధోరణులు” అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ప్రొఫెసర్ శర్మ మాట్లాడుతూ… సివిల్ ఇంజినీరింగ్‌లోని వివిధ ప్రత్యేకతలను సమగ్రంగా కలిగి ఉండే సమపూర్ణ జ్ఞానాన్ని విద్యార్థులు అలవరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో ఎదురయ్యే ప్రాయోగిక సమస్యలకు పరిష్కారాలు అందించడానికి సాంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా, సృజనాత్మకంగా మరియు వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సివిల్ ఇంజినీరింగ్‌లో సుస్థిర సాంకేతికతల వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రాధాన్యంగా పేర్కొన్నారు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.