ముద్ర, గద్వాల:
ధరూర్ మండలం వామన్ పల్లి గ్రామంలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్ కు గురువారం గ్రామ సర్పంచ్ పర్నికా కృపాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు గ్రామస్తులకు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, జీవితంలోని కష్టసుఖాలను, సవాళ్లను ఆశావాద దృక్పథంతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు డి.నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ శిరీషరాజు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.