బోడుప్పల్, ముద్ర విలేకరి: పేద వెనుకబడిన జాతులకు, వర్గాలకు విద్య మరియు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభించేలా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర నకాష్ సంఘం ఏకగ్రీవంగా సమర్థించింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన సంఘం రాష్ట్ర సమావేశం తీర్మానించింది. ప్రభుత్వ చర్యను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఈ చారిత్రాత్మక అడుగు ఎన్నో రకాలుగా వెనుకబడిన వర్గాల జీవితాల్లో కొత్త ఆశలు, అవకాశాలు తెచ్చి వారి అభివృద్ధి కి దోహధపడుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొంది. ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి దృడ సంకల్పంతో ఈ రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చినందునకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరిచింది. ఈ పక్రియలో క్రియాశీలక పాత్ర పోచించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర నకాష్ సంఘం తీర్మానించింది. ఈ సమావేశంలో రాష్ట్ర నకాష్ సంఘం అధ్యక్షుడు రాచర్ల కేశవరావు, అసోసియేట్ అధ్యక్షుడు కె. అశోక్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిచర్ల శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు కామరౌతు వినోద్ కుమార్, కోశాధికారి : సిరికొండ రాధాకృష్ణ, సహాయ కోశాధికారి ధనలకోట సతీష్, ఉపాధ్యక్షులు: నాంపల్లి కృష్ణ, సంగు శ్రీనివాస్, సముద్రాల గౌరీ శంకర్, ధనలకోట నర్సింగ్ రావు, కార్యదర్శులు రామగిరి శ్రీకాంత్, ముత్యాల శ్రీనివాస్, నాంపల్లి శ్రీకాంత్, హిమచందర్, నానాగిరి రామకృష్ణ, ఎమ్.శ్యామ్, డి. రామకృష్ణ, యువజన నాయకులు డి. నరేష్, కె. ప్రవీణ్ కుమార్, వెంకట్ రాజారావు, యాలాల సత్యనారాయణ, రఘు రామ్, రాజేందర్, శ్రీధర్ పాల్గొన్నారు.