బీబీనగర్, ముద్ర ప్రతినిధి
బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఈదమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు బొక్క జైపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ దేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు బొక్క జైపాల్ రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముక్కొండ కృష్ణారెడ్డి, మంచాల రవికుమార్, జక్కినగేష్, బద్ధం శేఖర్ రెడ్డి, భానోత్ నరేందర్ నాయక్, దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పచ్చిమట్ల వంశీ గౌడ్, శ్రీకాంత్, జక్కి నరసింహ, దొంతి రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, దొంతి రెడ్డి విజయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.