Take a fresh look at your lifestyle.

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు.నిర్మల్ రూరల్ లో147, నిర్మల్ పట్టణం లో 344 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పెళ్ళైన ఆడబిడ్డలకు రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటకెక్కించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు జమాల్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, సాత్విక్,జింక సూరి, ఖమ్మం సురేందర్, అర్జున్, విఠల్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.