Take a fresh look at your lifestyle.

టీబీ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అదనపు జిల్లా కలెక్టర్ ఉమశంకర్ ప్రసాద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ వికారాబాద్ నందు టీబీ అవగాహన ర్యాలీని ముఖ్య అతిథి అడిషనల్ కలెక్టర్ శ్రీ ఉమా శంకర్ ప్రసాద్ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి ప్రారంభించారు.

ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మహావీర్ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, బృంగి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టీబీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టీబీ చికిత్స పొందుతున్న రోగులకు యజ్ఞ ఫౌండేషన్ వారి సహకారంతో పోషకాహార కిట్లను శ్రీ ఉమా శంకర్ ప్రసాద్ అడిషనల్ కలెక్టర్ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రసంగిస్తూ టీబీ వ్యాధి సాధారణంగా ఒకరి నుండి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ వ్యాధి లక్షణాలు జ్వరము, తేమడ తో కూడిన దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని తెలిపారు. టీబీ వ్యాధి సోకిన వారు వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకోవాలి. చికిత్స కాలం 6 నుండి 8 నెలల వరకు ఉంటుంది. వైద్య సిబ్బంది టీబీ నిర్ధారణ అయిన రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చికిత్స తీసుకునే విధంగా చూడాలి. కుటుంబ సభ్యులు కూడా టీబీ రోగి పూర్తి చికిత్స తీసుకునే విధంగా జాగ్రత్తపడాలి. చికిత్స కాలంలో రోగికి మంచి పోషకాహారం అందించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహావీర్ వైద్య కళాశాల డాక్టర్ సుబశ్రీ, వైద్య విద్యార్థులు బృంగి కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రప్రియ, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.