- తాటికొండ సీతయ్య మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు.
తుంగతుర్తి, ముద్ర: నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ నిందుతినిగా చేర్చినందున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షు లు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉండడంవలన దర్యాప్తు చేయడం ఇబ్బందిగ ఉంటుంది కావున వెంటనే రాజీనామా చేసి దర్యాప్తు సక్రమంగా జరిగేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఓటు కు నోటు కేసు లో బెయిలు పై ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా మనీ అన్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలు యద్యురప్ప కర్ణాటక ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు వస్తే అన్ని రాజకీయ పార్టీలు రాజీనామా కోరినాయని ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేయాలని.. లేని యెడల అందులో ఉన్న మతలబును ప్రజలు గ్రహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపగాని వెంకన్న.. షేక్ జూనీ తదితరులు పాల్గొన్నారు.