ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో శ్రీ గాయత్రీ అనాథ వృదాశ్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వృద్దులకు పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ సేవలు అమోఘమని కొనియాడారు. ఆయనే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్లు అల్లే గంగసాగర్ దాసరి ప్రవీణ్, సత్యం, వీరబత్తిని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, ప్రవీణ్ రావు, భిక్షు, నిరంజన్, క్రాంతి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహేష్ కుమార్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
