Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారు

  • మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో అందర్నీ సమన్వయం చేసి, రేవంత్ రెడ్డికి అండగా నిలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో పీ సీ సీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి ఆద్వర్యంలో పీ సీ సీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణకు మారు పేరని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఎన్ ఎస్ యూ ఐ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని.. అయన సేవలను అధిష్టానం గుర్తించిందన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమన్వయం తో బీ సి లకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించారని, బీసీ రిజర్వేషన్ ల పెంపు లో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర ఎనలేనిదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేష్ కుమార్ ఆద్వర్యంలో విజయం సాధిస్తామని, ఆయన్ని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమలో ఆర్టియే సభ్యులు కమటాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బండ శంకర్, గజేంగి నందయ్య, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.