ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ కుమారుడు చావ యువరాజ్ పుట్టినరోజు సందర్భంగా భువనగిరి పట్టణంలోని సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు రానున్న పరీక్షలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన ఎగ్జామ్ పాడ్స్,పెన్సిల్ బాక్స్,వాటర్ బాటిల్ చేరు మాళ్లను అందజేశారు.విద్యార్థులకు అవసరమైన వస్తువులను చేతుల మీదగా డాక్టర్ చావా రాజ్ కుమార్ సతీమణి డాక్టర్ చావా అసలేష కుమార్తె ఆకృతి హాస్టల్ వార్డెన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా హాస్టల్ నందు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించి చిన్నారులతో కొంత సమయం గడిపి వారికి రానున్న పరీక్షలను ఉద్దేశించి బాగా చదువుకొని మంచి మార్కులు సాధించవలసిందిగా డాక్టర్ విద్యార్థులకు అభినందించారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ ఇన్చార్జ్ ఆనంద్,సిబ్బంది అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాస్, సాయి పాల్గొన్నారు.