- పి ఎస్ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
- పటేల్ చెరువు,పెద్దకుడి చెరువు, రామసముద్రం కుంట చెరువు, నాయనమ్మ కుంట చెరువులకు మహర్దశ.
ముద్ర, శేరిలింగంపల్లి – విలేకరి: నియోజకవర్గంలోని 64 చెరువుల ను సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతాం అని పి ఎస్ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు మంగళవారం నాడు మియపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ లో గల నాయనమ్మ కుంట చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ, IGUS, HDFC బ్యాంక్ ల వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనం లో పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఇరిగేషన్ అధికారుల తో కలిసి పరిశీలించిన పి ఎస్ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భ ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరికరణ తో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుద్దా మని, చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే నా ధ్యేయంగా పనిచేస్తానని, చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి,జీవ వైవిధ్యం పెరుగుతుంది,పక్షలు వలసలు మొదలు అవుతాయి అని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని , చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే వారు కనబడే దేవుళ్ళతో సమానమని, మియపూర్ లో అన్ని చెరువులకు సుందరికరణ భాగ్యము కలిగినదాని, త్వరలోనే మియపూర్ రూపురేఖలు మారునని దశ దిశ మారినది అని ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్చమైన ఆహ్లదకరమైన వాతావరణం అందించడమే నా లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని, ఏఇ పావని ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
