ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
ఈ నెల 12వ, తేదీన జరగబోయే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని, బి ఆర్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, టైగర్. కృష్ణయ్య జిల్లా కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేలాది మంది కార్మికుల ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న 39 కార్మిక చట్టాలను, 4, లేబర్ కోడ్ లుగా మారుస్తూ కార్మికుల హక్కులను కాలరస్తుందని, విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడి దారులకు అనుగుణంగా కార్మిక చట్టాల్లో అనేక మార్పులు చేసిందని విమర్శించారు. కార్మికుల ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కార్మికులకు పిలుపు నిస్తున్నాము. లేదంటే కార్మికుల మనుగడకే ప్రమాదమణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిబ్రవరి 12న, అన్నీ మిత్రపక్షా కార్మిక సంఘాలను కలుపుకొని అన్ని నియోజక వర్గాల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు సభలు నిర్వహించాలని పిలుపు నిస్తున్నాము. ఈ సమ్మెలో జిల్లాలోని అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, మెడికల్ & హెల్త్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రైవేటు కంపెనీల కార్మికులు, వి ఓ ఏ హమాలి కార్మికులు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, విద్యుత్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, గని కార్మికులు, వి ఓ ఏ లు, మెప్మ ఆర్ పి లు, ఐ కే పి ఉద్యోగులు, తది తర రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జప్రదం చేయాలని పిలుపునీచ్చారు.