ముద్ర, తెలంగాణ బ్యూరో :
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త. జనవరి 23 నుంచి భక్తులకోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలు ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ చూసేందుకు హెలికాప్టర్ నడపనున్నట్టు తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. ములుగులో ఈ సేవలు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఒక్కొక్కరికి 5 వేల రూపాయలతో ఏడు నిముషాల పాటు ఏరియల్ వ్యూ చూసే అవకాశం కల్పించారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ హెలికాప్టర్ జాయ్ రైడ్ సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సేవలు తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీలు, Thumby Aviation (HeliTaxii) ద్వారా నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో భర్తుల రద్దీ, మేడారం ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసే అదృష్టం ఈ విహంగ వీక్షణం కల్పిస్తుంది.
ఏరియల్ వ్యూ జాయ్ రైడ్ వివరాలు
ఇది కేవలం మేడారం జాతర ప్రదేశంపైనే హెలికాప్టర్లో చిన్న సర్క్యూట్ రైడ్
ఈ రైడ్ సమయం 7 నుంచి 10 నిముషాలు ఉంటుంది
జాతర సందడి, భక్తుల సమూహాలు, అటవీ ప్రాంతం, దేవతల గద్దెలు ఆకాశం నుంచి చూసే అద్భుత అవకాశం
ఒక్కో హెలికాప్టర్లో 5 నుంచి 6 మంది ప్రయాణికులు ఉండొచ్చు
అవసరమైన సెఫ్టీ ప్రమాణాలు, శిక్షణ తీసుకున్న పైలట్లు ఉంటాయి
ఛార్జీల వివరాలు చెప్పుకుంటే.. గడిచిన సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 3,700 నుంచి 4,800 వరకూ ఉంది. ఈ ఏడాది ఆ ధరలు కొంత పెరిగాయ్ 4,800 నుంచి 5 వేల రూపాయలు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు.
ఇక షటిల్ సర్వీస్ రైడ్ హనమకొండ నుంచి మేడారం రౌండ్ ట్రిక్ కోసం 35,999 ఉంది…ఇది రౌండ్ ట్రిప్ + వీఐపీ దర్శనం కలిగి ఉంటుంది. కానీ జాయ్ రైడ్ దీనికి పూర్తిగా భిన్నం ఇది కేవలం మేడారంలోనే ఆఫర్ చేసే షార్ట్ రైడ్. అందుకే దీని సమయం 7 నుంచి 10 నిముషాలు
ఆన్ లైన్లో www.helitaxii.com లేదా www.thumbyaviation.com వెబ్‌సైట్‌లో ఈ సేవలు బుక్ చేసుకోవచ్చు. లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి ముందుగా బుక్ చేసుకోవడమే మంచిది. ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్.. అడ్వెంచర్స్ ఇష్టపడేవారికి, ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు అద్భుత అనుభవం. రద్దీలో చిక్కుకోకుండా జాతర సౌందర్యాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో మేడారం జన సంద్రాన్ని తలపిస్తుంది. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాదు…చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు.