-మృతుని కుటుంబానికి వాట్సప్ గ్రూప్ చేయూత.
-33 వేల రూపాయలు నగదు, క్వింటా 25 కిలోల బియ్యం అందజేత.
ముద్ర, మోత్కూర్ :
మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సేవలు అభినందనీయమని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య,మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి లు అన్నారు. మున్సిపల్ కేంద్రానికి చెందిన కన్నెబొయిన సతీష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ దాతలు,సభ్యుల సహకారంతో అందించిన రూ.33 వేల చెక్కు,1 క్వింటా 25 కిలోల బియ్యం వారి చేతుల మీదుగా మృతుని భార్య ఎల్లమ్మ కి స్వయంగా అందజేశారు. వాట్సప్ గ్రూప్ జిల్లాలో నే ఆదర్శనీయమైందని,ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర ఆలయ చైర్మన్ గుండగొని రామచంద్రు,మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గనగాని నర్సయ్య, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, వాట్సప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు, కోమటి మచ్చగిరి,చోల్లేటి నరేశ్, మొరిగాల శ్రీను, కోమటి జనార్దన్, జంగ నర్సయ్య,పురుగుల రమేష్,జంగ సతీష్,వడకాల యాదగిరి,కె గిరి తదితరులు పాల్గొన్నారు.