ముద్ర,మోత్కూర్:
మోత్కూరు రైతు సహకార సంఘం లిమిటెడ్ బ్యాంకులో మంగళ వారం అర్థ రాత్రి ఉద్యోగులు తప్ప తాగి తందనాలు ఆడారు. అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్ లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో ఉద్యోగులు కలిసి మద్యం సేవించారు. బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి సమయంలో లోన్ లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కొరుతున్నారు.