రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆద్వర్యంలో పోస్టల్,డాక్టర్స్ డే పురస్కరించుకొని మంగళవారం పలువురు ఆర్.ఏం.పీ వైద్యులు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వైద్యుల, పోస్టల్ ఉద్యోగుల సేవలను గుర్తు చేస్తూ శాలువాతో సన్మానించినట్లు చెప్పారు. క్లబ్ సభ్యులు తిరుపతి, సుదర్శన్ గౌడ్, నారాయణ రెడ్డి, రాజేష్ ఖన్నా, సత్యం, వెంకటేశం పాల్గొన్నారు.