Take a fresh look at your lifestyle.

“ఓబీసీల పోరుబాట” పుస్తక ఆవిష్కరణ

కోరుట్ల, ముద్ర విలేకరి: ప్రముఖ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ పుస్తకాన్ని మహాగాథా సంస్థ ప్రచురించింది. ఆరేళ్ల లోతైన పరిశోధన, ఆరు రాష్ట్రాలు తిరిగి లోతైన పరిశోధన తో ఈ దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను ఈ పుస్తకంలో విపులంగా పొందుపరచడం జరిగిందని, 9 విభాగాలుగా నిర్మితమై పలు అంశాలపై లోతైన దృష్టి సారిస్తుందని, ఓబీసీ మేనిఫెస్టో, దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులతో జరిపిన సమావేశాలు, ప్రజా డిమాండ్ల సమాహారం ఈ పుస్తకం రచయితల మనోగతం అని సంఘ సభ్యులు అన్నారు. కార్యక్రమంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ అధ్యక్షులు గుంటుక ప్రసాద్, టీఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్ర శ్రీనివాస్, సంఘ ఉపాధ్యక్షులు కటుకం వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.