Take a fresh look at your lifestyle.

భువనగిరి ఖిల్లాఫై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి ఖిల్లాఫై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డిలు అన్నారు. మంగళవారం
బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భువనగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లా పై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భువనగిరి మున్సిపాలిటీ పై గులాబీ జెండాను ఎగురవేసేందుకు, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.